రైలు ప్రయాణం అనేది దూరం వెళ్తే ఎంతో అందంగా ఉంటుంది. సామాన్యులకు రైలు ప్రయాణం అనేది ఎంతో ఇష్టంగా ఉంటుంది. రైలు ప్రయాణం విషయంలో మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉంటాయి. ఇక రైలు పట్టాల మీద ఉండే బోర్డుల నుంచి ప్రతీ ఒక్కటి ఆసక్తికరమైన విషయాలే. అలాంటి ఒక విషయమే రైలు పట్టాల మీద ఉండే బోర్డు.
Also Read:వికారాబాద్ బాలిక హత్య కేసులో ట్విస్ట్..!
W/L అని ఒక బోర్డు ఎల్లో కలర్ లో ఉంటుంది గమనించారా…? ఆ బోర్డు మీద ఉండే అక్షరాలకు అర్ధం విజిల్ ఫర్ లెవెల్ క్రాసింగ్. అంటే లెవెల్ క్రాసింగ్ వస్తుంది ఈల వేయుమని అర్ధం. ఇలాంటి వాటిని రైల్వే పరిభాషలో కాషన్ బోర్డు అని పిలుస్తూ ఉంటారు. ఇది రైల్లో పైలెట్ కి వార్నింగ్ లాంటిది. హిందీ లో దాన్ని సీ.ఫా అంటారు…సీటి బజావో.. ఫాటక్ ఆగే అని అంటారు. దాన్ని షార్ట్ కట్ లో సీటీ ఫాటక్ లేదా, సీ.ఫా అని పిలుస్తారు.
ముఖ్యంగా సెక్యూరిటీ గా గేట్లు లేని లెవెల్ క్రాసింగ్ ల వద్ద ఈ ఏర్పాటు చేస్తూ ఉంటారు. పట్టించుకోకుండా వాహనదారులు, పాదచారులు వచ్చేసే అవకాశం ఉంది. ఇలా అప్రమత్తం చేయడానికి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అది. ఈ విధంగా ప్రజల రక్షణ కోసం అనేక రకాల బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉంటారు.
Also Read:బంగాళాఖాతాన్ని వారధిగా మార్చే సమయం ఆసన్నమైంది