బాహుబలి ఇచ్చిన కిక్కుతో దర్శకుడు రాజమౌళి నుంచి అనౌన్స్ అయిన మరోభారీ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ కి చాలా క్రేజ్ వచ్చింది. అయితే తమ కాంబోకి యా ధృచ్చికంగా వారు పెట్టుకున్న యాష్ ట్యాగ్ ఆర్ఆర్ఆర్.
క్రమంగా అదే పదం టైటిల్ గా ఫిక్స్ అయిపోయిందంటే ఎంతగా ఈ కాంబినేషన్ జనంలోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్టుగానే ట్రిపుల్ ఆర్ విడుదలై సెన్షేషనల్ హిట్ అయ్యింది. నాటునాటు పాట ఆస్కార్ తెచ్చిపెట్టింది.తెలుగు సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది.
అయితే మూవీ మేకింగ్ లో ఉండగా వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది.
సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశాడు రాజమౌళి.
నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. తర్వాత సినిమా మార్చ్ లో విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే పాటలు విడుదల చేశారు. ఈ పాటలు చాలా ఫేమస్ అయ్యాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమాలోని దోస్తీ వీడియో సాంగ్ ఇటీవల విడుదల అయ్యింది.
అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంది. అందులో కొమరం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మాంసం తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే నుంచున్న రామరాజు, అలాగే రామరాజు బాబాయ్ భీమ్ ని చూస్తారు. భీమ్ ఆ మాంసం తీసుకెళ్లి లోపల ఉన్న రాహుల్ రామకృష్ణకి ఇస్తాడు.
Also Read: హనీపాప…2008లోనే టాలీవుడ్ తెరంగేట్రం చేసిందా..!?
అప్పుడు రాహుల్ రామకృష్ణ మాంసం ఒక రంధ్రంలో నుంచి లోపలికి వేస్తారు. అప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అది మనం సినిమా చూస్తున్నప్పుడు మొదటిసారి గమనించం. కానీ అప్పుడే పులి సౌండ్ వస్తుంది.
అంటే భీమ్ అప్పటినుండే ఆ జంతువులు అన్నిటికీ ఆహారం పెట్టి వాటిని దాడి కోసం తయారు చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.ఈ మైన్యూట్ డీటేల్స్ అన్నీ పక్కాగా ఫాలో అవుతాడు కాబట్టే రాజమమౌళి తెలుగుతెర జక్కన్న అయ్యాడు.