పెయింటర్ బాబు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. చాలా తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. బాలీవుడ్ లో ఉన్న ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. బ్రహ్మర్షి విశ్వామిత్ర, జీవన పోరాటం వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది మీనాక్షి. ఆ తర్వాత కె.విశ్వనాధ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆపద్బాంధవుడు సినిమాలో నటించింది.
ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ సంగీత ప్రియులను మాత్రం ఆకట్టుకుంది. ఇక 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అమెరికాలో సెటిల్ అయింది.
అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ఉదయ్ కిరణ్ తో గొడవ పడ్డ డైరెక్టర్ తేజ ! చివరికి ఏమైందంటే ?
ప్రస్తుతం అమెరికాలోని ఓ డాన్స్ స్కూల్ నడుపుతూ ఫుల్ బిజీ గా గడుపుతుంది. ఇక మీనాక్షి కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా మీనాక్షి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన వారంతా కూడా షాక్ కు గురవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన మీనాక్షి శేషాద్రి ఇలా మారిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
Also Read: ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టటానికి సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా ?