అలనాటి తార, అందాల సుందరి శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అందంతో అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అన్ని భాషలలో చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీదేవి బాలకృష్ణ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి ఒక కారణం ఉందట. నిజానికి చిన్ననాటినుండే సినిమాల్లో నటించింది శ్రీదేవి.

వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా చాలా మంది హీరోలతో నటించింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ మనవరాలి గా కూడా శ్రీదేవి చిన్నప్పుడు నటించింది. పెద్దయిన తర్వాత తనతోనే హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన బడిపంతులు, వేటగాడు, ఆటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం వంటి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.
మహేష్, మెగా ఫ్యాన్స్ మధ్య వార్…ఇంత మాటన్నాక ఊరుకుంటారా!!
అయితే ఎన్టీఆర్ శ్రీదేవిని ఒక బిడ్డలాగా చూసుకున్నాడట. అలాగే బాలకృష్ణను శ్రీదేవితో నటించవద్దని చెప్పాడట. శ్రీదేవి నాతో చాలా సినిమాలు చేసింది. నీకు తల్లి లాంటిది. జీవితంలో ఆమెతో నటించకు అని చెప్పారట.
ముత్తైదువులకు బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? అలా పెడితే అరిష్టమేనా!
Advertisements
అందుకోసమే శ్రీదేవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎటువంటి సినిమాలో రాలేదట. తండ్రి మాటకు కట్టుబడి ఆమెతో సినిమా అవకాశాలు వచ్చినా చేయలేదట బాలయ్య.