ఈ రోజుల్లో హీరోయిన్ అనగానే చాలా వరకు గ్లామర్ పాత్రలు చేయాలి లేదా స్కిన్ షో ఉండాలి. లేదంటే కెరీర్ నాశనం అయినట్టే. కాని కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూనే తమ పర్సనల్ లైఫ్ లో వెనక్కు తిరిగి చూసుకుంటే ఒక గౌరవం ఉండే విధంగా సినిమాలు చేస్తూ ఉంటారు. అందులో ఈ తరానికి చెందిన సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది అనే చెప్పాలి.
సినిమా అవకాశాల కోసం భయపడకుండా ఏ మాత్రం తన గౌరవం కోల్పోకుండా సినిమాలు చేస్తుంది. ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా ఉండే ఆమె… స్కిన్ షో విషయంలో వెనక్కు తగ్గే అవకాశమే ఉండదు. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు న్యూ ఇయర్ కి అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఆమె మాత్రం డిఫరెంట్ గా సెలెబ్రేట్ చేసుకోవడం ఆశ్చర్యపరిచింది. అనంతపురంలోని పుట్టపర్తి ఆశ్రమానికి వెళ్ళింది.
అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి గడిపింది. హీరోయిన్లు అందరూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటే ఆమె ఇలా చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏది ఎలా ఉన్నా సరే సాయి పల్లవి విధానాలు మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంటాయి. తనను ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్ళింది. అయితే సినిమాల్లో ఆమెకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉందని అందుకనే సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. డాక్టర్ గా కెరీర్ లో ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.