వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఎంపీ ప్రజ్ఞాసింగ్ మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. ఎంపీ కారణంగా విమానం ఏకంగా 45నిమిషాలు ఆలస్యం కావటంతో తోటి ప్రయాణికులంతా మండిపడుతున్నారు. ఎమర్జెన్సీ సీటులో ఉన్న ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ను నాన్-ఎమర్జెన్సీ సీటులోకి మారాలని కోరటం అందుకు ఆమె నిరాకరించటంతో వివాదం మొదలైంది. స్పైస్ జెట్ సిబ్బంది ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 45 నిమిషాల తర్వాత ప్రజ్ఞాసింగ్ సీటు మారటంతో… విమానం బయలు దేరింది. ఈ వివాదంపై ప్రయాణికులు ఎంపీ పై ఫిర్యాదు చేయగా… తాను బుక్ చేసుకున్న సీటును ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించారని ఎంపీ అధికారులకు ఫిర్యాదు చేయటం విశేషం.