వారి బాటలోనే మరో జంట విడిపోవడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి సినీ వర్గాలు నిజమనే అంటున్నాయి. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది..? అసలు ఎవరు ఆ తెలుగు సినీ పరిశ్రమ జంటలకు ఏమైంది..? ఇప్పటికే సమంత, నాగ చైతన్య విడిపోయి హాట్ టాపిక్ గా మారారు.జంట..?
అందరికీ ఎంతో సుపరిచతమైన గాయకుల జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి.. ఈ జంట విడిపోతున్నారనే గుసగుసలు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఈ విషయం నిజమా అంటే నిజమానే తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా హేమచంద్ర, శ్రావణ భార్గవి విడివిడిగా ఉంటున్నారు. అదే ఈ గుసగుసలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
హేమచంద్ర, శ్రావణ భార్గవి లది ప్రేమ వివాహం కొద్ది కాలం ప్రేమించుకున్న తరువాత వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి తొమ్మిదేళ్ల వైవాహిక బంధానికి గుర్తుగా ఒక పాప కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యతలుగా కూడా వ్యవహరించారు. హేమచంద్ర, శ్రావణ భార్గవిలు ఇద్దరు కూడా గాయకులుగా మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు.
అంతే కాకుండా వీరిద్దరూ డబ్బింగ్ కూడా చెప్తూంటారు. మొన్నీమధ్య కూడా ఆహాలో నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం కు కూడా ఇద్దరు కలిసే వచ్చారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తలు ఎంత వరకు నిజం అన్న దాని కోసం వేచి చూడాల్సిందే.