అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. - Tolivelugu

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

ఒకే పత్రిక.. రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు కార్మికుల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతవరకు గుడ్.

కానీ, ఒక్కో స్టేట్‌కీ ఒక్కో యాంగిల్లో న్యూస్ ప్రొజెక్టు చేసిందే.. అదే ఇప్పుడు టాపిక్..

, అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

హైదరాబాద్: సాక్షి దిన పత్రిక రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగే పత్రిక. ఏపీలో ఈ పేపర్ పూర్తిగా వైసీపీకి కరపత్రం అని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. కనీసం తెలంగాణాలో అయినా ఆ పత్రిక తటస్థంగా వుంటుందని కొంతమంది అనుకుంటూ వుంటారు. అలాంటి వారి కళ్లు ఇవాళ తెరుచుకున్నాయి.

తెలంగాణాలో దగ్గర దగ్గర 5వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల రోడ్డున పడుతుంటే.. ‘దిశ మారితే దసరానే’ అనే పతాక శీర్షిక ఇచ్చింది.

ఇక్కడ ఏపీలో పాలకులకు సంబంధించిన అపోజిట్ సామాజిక వర్గానికి చెందిన సంస్థ లేఆఫ్ ప్రకటించిన వార్తను చాలా బాగా హైలైట్ చేసింది. ‘పండగ వేళ కార్మికులపై శరాఘాతం’ అంటూ శీర్షికలోనే విరుచుకుపడింది.

ఏమైనప్పటికీ, ఇలా రెండు సామాజిక వర్గాలను, రెండు రాజకీయ పార్టీలను, రెండు ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకుని ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో.. అప్పటికా మాటలాడుతూ’ పనిచేయగలగడం ఆ పత్రికలో పనిచేసే వారికి ఎంత కత్తిమీద సామో కదా.. అనేది విశ్లేషకుల కామెంట్!

, అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

, అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

Share on facebook
Share on twitter
Share on whatsapp