ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. భారత్‌లో డిజిటల్ రూపాయిని తీసుకొస్తున్నట్లు బడ్జెట్ తెలిపారు. వీటితో పాటు వర్చువల్, డిజిటల్ ఆస్తులపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ఫిక్స్ చేశారు. దీంతో ఆర్బీఐ నియంతృత్వంలో డిజిటల్ కరెన్సీ కొనసాగనున్నట్లు స్పష్టమైంది.
ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం పన్ను విధిస్తామన్నారు.
క్రిప్టో కరెన్సీ చాలా దేశాల్లో చట్టబద్దం చేశారు. కానీ భారత్ లో మాత్రం దీనిపై సందిగ్థం నెలకొంది. ప్రపంచ దేశాల్లో దీని వాడకం పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ఆ కమిటీ వాడకపోవడం మంచిదని నివేదిక సమర్పించింది. క్రిప్టో కరెన్సీకి నిర్దిష్ట విలువ ఉండదని.. వీటిపై ప్రభుత్వాల అజమాయిషీ కూడా ఉండదని తన నివేదికలో వివరించింది.
దీంతో ఆర్బీఐ 2018లో క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించింది. కానీ.. 2020 మార్చిలో ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పరిమిత స్థాయిలో లావాదేవీలు నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆర్బీఐ నియంత్రణలో డిజిటల్ రూపాయిని తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.