నేచురల్ స్టార్ నాని నటించిన తన 25వ చిత్రం ‘వి’. సుధీర్‌బాబు హీరోగా నటించగా, సినిమా ఓటీటీలో వచ్చే వరకు నాని విలన్ క్యారెక్టర్ చేశాడని అంతా అనుకున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్‌గా నటించారు.
మార్చి 25న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. చాలా కాలం వెయిట్ చేసి చివరకు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు. థియేటర్ రైట్స్ తమ వద్దే ఉంచుకొని, డిజిటల్ రైట్స్ మాత్రం 25కోట్లకు పైగా ధరతో అమ్మేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవటంతో దిల్ రాజు వి మూవీని థియేటర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
50శాతం ఆక్సుపెన్సీతో థియేటర్లు తెరిచేందుకు సర్కార్ అనుమతివ్వటంతో వి మూవీని మళ్లీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.