రాజమహేంద్రవరం: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌సింగ్ ఆదివారం కడియం మండలం కడియపులంక గంగుమళ్ల నర్సరీని సందర్శించారు. స్పైన్, థాయిలాండ్ వంటి దేశాల నుంచి తీసుకొచ్చిన పలు మొక్కలను ఆసక్తిగా తిలకించి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటపాటు నర్శరీలో సేద తీరారు. కడియం నర్సరీ అందాలు ఎంతో అద్బుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. నర్సరీ రైతులు గంగుమళ్ల సత్యనారాయణ, తాతాజీ, నగేష్ దిగ్విజయ్‌సింగ్‌కు ఘనంగా స్వాగతం పలికారు.