నందమూరి హీరోకు దిల్‌రాజ్‌ షాక్ - Tolivelugu

నందమూరి హీరోకు దిల్‌రాజ్‌ షాక్

తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు హావా ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇంతింతై వటుడింతై అన్నతరహాలో పరిశ్రమలో దిల్ రాజు ప్రస్థానం ఉంది. సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతూనే ఆయన పంపిణీ రంగంలోనూ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. పరిశ్రమలో ఏ హీరో సినిమా వచ్చిన ఆయనను సంప్రదించలనేంతగా రాజుగారు పేరును సంపాదించుకున్నారు. స్టోరీ నచ్చితే ఆయనే విడుదల చేస్తారు… ఇంకా మరీ నచ్చితే రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేస్తారు. ఇది దిల్ రాజు వ్యాపారం.

ఇక ఉత్తరాంధ్రలో మెజార్టీ థియేటర్లు ఆయన చేతిలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమాను ఆయనే రిలీజ్ చేశారు. మొదటి రెండు, మూడు రోజులు సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. తరువాత కలెక్షన్స్ తగ్గినప్పటికీ థియేటర్లలో దర్బార్ సినిమా సందడి చేస్తూనే ఉన్నది. అయితే ఈ ప్రభావం ఎంత మంచివాడవురా పై పడనుందట. ఎంతమంచి వాడవురా ఉత్తరాంధ్ర రిలీజ్ రైట్స్ రాజు గారికి ఇవ్వకపోవడంతో ఈ సినిమా విడుదలకు ముందే కష్టాలు ప్రారంభమైయ్యాయి.ఆ ప్రాంతంలో ఎంత మంచివాడవురాకు కేవలం 15 థియేటర్లు మాత్రమే దొరికాయట. ఇప్పట్లో దర్బార్ ను తొలగించే ఛాన్స్ లేదట. సో, మంచోడికి విడుదలకు ముందే కష్టాలు షురూ అయినట్లు తెలుస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp