దిల్ రాజు… తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాత. ఏ సినిమా హిట్టో, సినిమాను ఎలా హిట్ ట్రాక్ ఎక్కించాలో పక్కాగా లెక్కలేసుకుంటాడు. అందుకే తను ఈ రోజు బడా నిర్మాతలతో ఒకరిగా ఉన్నాడు. అయితే… దిల్ రాజు భార్య కొంతకాలం క్రితం మరణించటంతో ఆయన మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఫిలింనగర్‌లో వినపడుతోంది. దిల్ రాజు భార్యగా రాబోతుంది ఎవరు…? సినిమా ఫీల్డ్‌కు సంబంధించిన వారా…? ఎవరా వ్యక్తి అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
అయితే, దిల్ రాజు పెళ్లి అనగానే… ఇండస్ట్రీ దగ్గరి నుండి చూసిన వారు గతంలో దిల్ రాజు సన్నిహితంగా ఉన్న ఆ హీరోయిన్‌నే పెళ్లి చేసుకుంటాడు అని అంతా అనుకున్నారు. అప్పట్లో ఆ హీరోయిన్‌తో దిల్ రాజు సాన్నిహిత్యం అలాంటిది. పైగా పెళ్లి వార్త బయటకు వచ్చే కొద్ది రోజుల ముందు ఆ హీరోయిన్‌కు ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా కొనిచ్చాడట.
అయితే, తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు పెళ్లి చేసుకోబోయేది ఆ హీరోయిన్ కాదని, విశాఖపట్నంకు చెందిన ఓ బ్రహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తని తెలుస్తోంది. ఆ హీరోయిన్ కారణంగా గతంలో వచ్చిన చిక్కులు… పెళ్లయ్యాక మళ్లీ రాకుడదన్న కారణంతోనే ఆ హీరోయిన్‌ను ఇలా సెటిల్ చేశారన్న కథనాలు జోరందుకున్నాయి.