భారీ అంచనాల నడుమ జాను సినిమాను నిర్మించారు దిల్ రాజు. తమిళ్ లో అదరగొట్టిన 96సినిమా రీమేక్ రైట్స్ కొనేసి జాను చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాపై ఆయన భారీ అంచనాలే పెట్టుకున్నాడు. తీరా ఆయన అంచనాలన్నీ తప్పాయి. కథలో కొంచెం మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికే టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హడావిడి నడుస్తోంది. దాంతో ఈ సినిమా కూడా సక్సెస్ ను తెచ్చిపెడుతుందని దిల్ రాజు అనుకున్నారు కానీ అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవు కదా!
సినిమాలను నిర్మించే సమయంలో అన్నింటిని బెరీజ్ వేసుకునే దిల్ రాజు నిర్ణయం ఇలా బెడీసికొట్టిందని చిత్ర పరిశ్రమ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శ్రీనివాస కళ్యాణం సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి జడ్జిమెంట్ ను అయితే ఇచ్చారో మరోసారి అలాంటి జడ్జిమెంట్ నే ఇచ్చారు.
తెలుగులో సమంత, శర్వానంద్ కాంబినేషన్ లో జాను సినిమాను తెరకెక్కించారు. ఎవ్వరు ఊహించని విధంగా ఘోరమైన ఫలితాన్ని చవిచూసింది ఈ సినిమా. ఈ సినిమాలోని ఎమోషన్ కు తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు.ఫస్ట్ ఆఫ్ కొంత ఎంటర్ టైన్ చేసినప్పటికీ సెకండ్ ఆఫ్ లో ఆద్యంతం శర్వా, సమంతల మధ్యే సినిమా మొత్తం కేంద్రీకృతం కావడంతో ప్రేక్షకులకు ఈ చిత్రం విసుగుతెప్పించింది.