టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు ఈ ఏడాది వరుసగా సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. సమ్మర్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ కానుండగా, ఆగస్టులో ఎఫ్-3 రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ రంగంలో మాత్రమే ఉన్న దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇప్పుడు హీరో రాబోతున్నారు.

దిల్ రాజుతో బ్రదర్ శిరీష్ కొడుకు అశీష్ ను హీరోగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతుంది. హుషారు మూవీని తెరకెక్కించిన శ్రీహర్ష ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు దిల్ రాజు ఫ్యామిలీ ఏమాత్రం వెనక్కిచూడకుండా భారీగానే ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ టెక్నిషన్స్ పనిచేస్తున్నట్లు సమచారం. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి రౌడీ బాయ్స్ అనే టైటిల్ ఖారారయ్యే అవకాశం ఉంది.