శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సి 15 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నారు. అంజలి, సునీల్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం నిన్న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోటి రూపాయలు ఖర్చు చేశారట దిల్ రాజు.
తారాగణం, సిబ్బంది అందరూ హైదరాబాద్‌కు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఖర్చులు, హోటల్ ఛార్జీలతో పాటు గ్రాండ్ ఈవెంట్ ఖర్చులు దిల్ రాజు కోసం దాదాపు కోటి ఖర్చు పెట్టాడట. బాలీవుడ్ నుంచి అలాగే రన్వీర్ సింగ్, కీరా అద్వానీ, రాజమౌళి, చిరంజీవిలా చాలా మంది అతిథులు హాజరయ్యారు.