ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుపై క్రాక్ డిస్ట్రిబ్యూటర్ ఫైర్ అవుతున్నారు. దిల్ రాజు చేతిలోనే నిజాం, వైజాగ్ ఏరియాల్లో చాలా వరకు థియేటర్లు ఉన్నాయి. దీంతో తను రిలీజ్ చేసే సినిమాలకే ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి.
అయితే, క్రాక్ సినిమాను నిజాం ఏరియాలో వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు. సినిమా తీసుకునే ముందు మూడు రోజుల పాటు దిల్ రాజు, శిరీష్ లతో మాట్లాడి… వారు సరిపడా థియేటర్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాకే క్రాక్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న సమయంలో తనకు థియేటర్లు లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
దిల్ రాజు ప్రస్తుతం రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాలను తీసుకున్నాడు. దీంతో మాస్టర్ కోసం క్రాక్ థియేటర్లు తీసేస్తూ… అంతగా ఆడని థియేటర్లు కేటాయిస్తున్నట్లు వరంగల్ శ్రీను ఫైర్ అవుతున్నాడు. దిల్ రాజు కాస్త కిల్ రాజుగా మారిపోతున్నాడంటూ మండిపడుతున్నారు. ఇక నుండి తాను సినిమాలపై కాకుండా దిల్ రాజు పై దృష్టిపెడతానంటూ వార్నింగ్ ఇస్తున్నాడు.