భవిష్యత్ అంతా ఓటీటీలదే అన్న అభిప్రాయం రోజురోజుకు బలపడుతుంది. కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత ఈ అభిప్రాయం మరింత పెరగటంతో బడా నిర్మాతలు, ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థలన్నీ ఓటీటీలపై దృష్టిపెట్టాయి. తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గ కథల కోసం సర్చించ్ మెదలుపెట్టారు.
అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె, కొత్త కథలపై దృష్టిసారించారని…ఓటీటీకి అనుగుణంగా ఓ డిఫరెంట్ కథను దిల్ రాజుకు అందించారని ప్రచారం సాగుతుంది. కథ తనకు నచ్చటంతో ఓ టీంను ఏర్పాటు చేసి దిల్ రాజు తన భార్యకు అటాచ్ చేశాడని, కథలను వారే పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
దీంతో దిల్ రాజు భార్య తేజస్విని సైతం ఇండస్ట్రీలోకి ఎంటరైనట్లేనని అంతా చర్చించుకుంటున్నారు.