రవితేజ ఖిలాడీ సినిమా అభిమానులను నిరాశపరిచింది. అయితే ఉన్నదాంట్లో ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణగా నిలిచింది మాత్రం విజయవాడకు చెందిన తెలుగు బ్యూటీ, డింపుల్ హయాతి అనే చెప్పాలి. సినిమాలోని పాటల్లో డింపుల్ ట్రీట్‌మెంట్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడికి పెద్ద ఆఫర్లను వస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మొత్తం యాక్షన్ నేపథ్యంలోనే తెరకెక్కుతుందట.
కాగా ఇందులో డింపుల్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. ఆమె గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో ఈ విజయవాడ అమ్మాయికి గోపీచంద్ సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందని కూడా టాక్ నడుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.