కుదిరితే కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేయడానికి బాలయ్య ఎప్పుడూ ముందుంటాడు. ఈ విషయంలో ఏజ్ గ్యాప్, లుక్ టెస్ట్ లాంటివి అస్సలు పట్టించుకోడు. ఈసారి కూడా మరో ముద్దుగుమ్మకు ఛాన్స్ ఇచ్చాడు నటసింహం. ఆమె పేరు డింపుల్ హయతి. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది డింపుల్ హయతి.
ఇంతకుముందు గద్దలకొండ గణేశ్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది డింపుల్. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా డింపుల్ కు కలిసిరాలేదు. దీంతో ఇప్పుడు బాలయ్య సినిమాలో చేయబోతున్న ఐటెంసాంగ్ పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది.
ఈ స్పెషల్ సాంగ్ తో పాటు గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా డింపుల్ నటిస్తోంది. ప్రస్తుతం క్రేజ్ లేక ఇబ్బంది పడుతున్న ఈ ముద్దుగుమ్మ, బాలయ్య, గోపీచంద్ సినిమాలతోనైనా క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.