పోలాండ్ లో 20 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ పాదముద్రలు, చర్మపు పొలుసులు కనుక్కొనబడ్డాయి. డైనోసార్ కదలికలు, వాటి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని పోలిష్ జియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్-నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు.
పోలాండ్ రాజధాని వార్సాకు దక్షిణంగా 130 కిలో మీటర్ల దూరంలో వీటిని గుర్తించారు. వీటి ద్వారా డైనోసార్ ల ప్రవర్తన మరియు అలవాట్లను గమనించవచ్చని తెలిపారు. పరుగెత్తడం, ఈత కొట్టడం, విశ్రాంతి తీసుకోవడం, కూర్చోవడం లాంటి జాడలను కూడా గుర్తించామని జియాలజిస్ట్ గ్ర్జెగోర్జ్ నీడ్జ్‌విడ్జ్కీ చెప్పారు. డైనోసార్ లలో కూడా మాంసాహారులు, శాకాహారులు ఉంటాయని.. మాంసాహార డైనోసార్ ల పాదముద్రలు సుమారు 40 సెం.మీ పొడవు ఉంటుందని ఈ అవశేషాలు ద్వారా గుర్తించినట్టు తెలిపారు.