భారతదేశంలో అనాధిగా ఆచారించుచున్న పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగను ఆశ్వయిజ మాసంలో అమావాస్య నాడు జరపుకుంటారు.
దీపావళి అనగా దీపముల వరుస, దీపముల సముహం అని అర్థం
ద్వాపర యుగంలో శ్రీమహవిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి… ఆ కాలంలో దేవ,ముని, గణ, సాదు, సజ్జనులను హింసించుచున్న నరకుడు అనే రాక్షసున్ని తన బార్య అయిన సత్యభామతో కలిసి సంహరించాడు. నరకున్ని సంహరించిన రోజున నరకచతుర్ధశిగా, ఆ తదుపరి దినం అనగా అమవాస్య నాడు దీపములను వెలిగించి లక్ష్మినారాయణను పూజించటమే దీపావళి అమావాస్య.
దీపావళి రోజున ఉదయాన్నే లేచి… నువ్వుల నూనేతో అభ్యంగన స్నానం ఆచరించి, గృహములను పూలతో, తోరణాలతో అలంకరించి… ముగ్గులు వేసి, సాయంకాలంన సంధ్యాసమయంన దీపములు వెలిగించి… మహలక్ష్మి దేవీని ఆరాధించి, బాణాసంచ వెలిగించి ఆనందించు పండగ దీపావళి. ఈ పండుగ ప్రాముఖ్యం అంతా మహలక్ష్మిని ఆరాదించుట, కొలుచుట, పూజించుట అని గ్రహించవలెను.
— ప్రసాద్ శర్మ, పురోహితులు