ఉక్రెయిన్ లో రష్యాతో యూఎస్ఏ, నాటో దళాలు పోరాడబోవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అలా పోరాడాల్సి వస్తే అది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుందని ఆయన అన్నారు.
‘ మేము యూరప్‌లోని మా మిత్రదేశాలతో కలిసి నిలబడతాం. యూఎస్, నాటో దళాలు పూర్తి శక్తితో నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాము’ అని ఆయన అన్నారు.
‘ ఉక్రెయిన్ లో రష్యాకు వ్యతిరేకంగా యుద్ధంలో మేము పోరాడబోము. నాటో దళాలకు, రష్యాకు మధ్య వివాదం అంటే అది మూడో ప్రపంచ యుద్ధమే. దీన్ని నిరోధించేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయాలి” అని తెలిపారు.
ఒక వేళ రసాయన ఆయుధాలను రష్యా ఉపయోగిస్తే యూఎస్ దళాలు ప్రతిస్పందిస్తాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఒక వేళ అలా చేస్తే రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు.