మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ అందుకోవడంతో చిత్ర యూనిట్ ఖుషీ ఖుషీగా ఉంది. అయితే చిత్ర ప్రమోషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన సీన్స్ అంత గొప్పగా అనిపించలేదని టాక్ వినిపిస్తోంది. పైగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎండింగ్ అదే స్థాయిలో లేదని చాలామంది పెదవి విరుస్తున్నారు. సాఫ్ట్ ఎండింగ్ ఇచ్చి అంచనాలను తుస్సుమనిపించారని పేర్కొంటున్నారు. అయితే ఇదే విషయమై అనిల్ రావిపూడి స్పందించారు. సినిమా ఎండింగ్ పట్ల విశ్రమ స్పందన వ్యక్తం అయినట్లు తనకు తెలుసునని.. కానీ అదంతా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిందని.. ప్రేక్షకుల నుంచి వచ్చింది కాదంటూ స్పష్టం చేశారు. అయితే క్లైమాక్స్ రాసే సమయంలో ఇలాంటి టాక్ వస్తుందని ముందే ఊహించానని చెప్పుకొచ్చారు. కానీ క్లైమాక్స్ సీన్ కు అదే బెస్ట్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో మహేష్ కూడా తనకు సపోర్ట్ చేశారని గుర్తు చేశారు.