సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విషెస్ లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరో వైపు హ్యాపీ బర్త్ డే అంటూ మహేష్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ ట్రెండ్ కూడా సెట్ చేశారు. ఇక విషయానికి వస్తే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వివిధ రకాలుగా విషెస్ లు తెలియచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది చిన్నారులు… మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను చిత్రీకరించారు. మహేష్ డైలాగ్స్, ఫైట్ తో పాటు హీరో కొడుతుంటే సినిమాలో చూపించినట్టే విలన్ లు ఎగిరిపడటం అంతా సినిమాలో చేసినట్టే చేశారు. ఆ వీడియోను దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు…ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ అంటూ రాసుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మంచి వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టింది.
I am truly stunned and pleasently surprised to see the dedication of these kids … extraordinary.
వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు👌😍
(Note: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ )https://t.co/lzTUwfdoiQ#SarileruNeekevvaru— Anil Ravipudi (@AnilRavipudi) August 10, 2020