వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్3 సినిమాకు రెడీ అయిన అనిల్ రావిపూడి… చిన్న సినిమాలకు అండగా నిలబడుతూనే ఉన్నాడు. గాలి సంపత్ అనే మూవీకి అనిల్ రావిపూడి స్క్రిన్ ప్లే రాసినట్లు తెలుస్తోంది. అలా ఎలా ఫేం అనిష్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా… శ్రీ విష్ణు లీడ్ యాక్టర్ నటించబోతున్నారు.
తండ్రి, కొడుకుల మధ్య సంబంధంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో తండ్రిగా సీనీయర్ నటుడు రాజేంద్రప్రసాద్ నటించబోతున్నారు. పూజా కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, వరుణ్ తేజ్, నారా రోహిత్ లు హజరయ్యారు. షైన్ స్క్రీన్స్, పార్క్ ఇమేజ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి.