విజయశాంతి చేసిన ఫీట్ చూసి ఆశ్యర్యపోతున్న ఫ్యాన్స్ .. - Tolivelugu

విజయశాంతి చేసిన ఫీట్ చూసి ఆశ్యర్యపోతున్న ఫ్యాన్స్ ..

13ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరుతో విజయశాంతి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్రలో ఓ పవర్ ఫుల్ రోల్ చేసి ఆమె అభిమానులను మెప్పించింది. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. తనలో ఏ మాత్రం మునుపటి ఫైర్ తగ్గలేదని నిరుపించుకుంది విజయశాంతి. ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతిపై తీసిన ఓ వీడియోను షేర్ చేశాడు దర్శకుడు అనిల్. ఆ వీడియోలో బ్రహ్మాజీని విజయశాంతి కాలితో కిక్ ఇస్తున్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 13 సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ రీ ఎంట్రీ అదుర్స్ మేడం.. అంటూ ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు లేడీ అమితాబ్ లో మునుపటి ఫైర్ తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు.

Image result for vijayashanthi sarileru neekevvaru photos

Share on facebook
Share on twitter
Share on whatsapp