శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. తండ్రి-కొడుకుల అనుబంధంతో ఈ మూవీ రానుండగా… సినిమాకు స్క్రీన్ ప్లే, సమర్పణ బాధ్యతలను డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకున్నారు. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ సినిమాకు గాలి సంపత్ అని టైటిల్ ఫిక్స్ చేశారు.
తాజాగా గాలి సంపత్ డైరెక్షన్ సూపర్ విజన్ బాధ్యతలను కూడా అనిల్ రావిపూడి తీసుకున్నారు. సినిమాపై ఎంతో నమ్మకం ఉందని, టీం వర్క్ ఎప్పుడూ ది బెస్ట్ గా ఉంటుందని నమ్మే వ్యక్తిగా మరిన్ని బాధ్యతలు తీసుకున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు.
ఈ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది.