వైవిధ్యభరితమైన కథలతో దర్శకుడు భరణి విశేష ఆదరణ పొందారు. నటుడిగా, దర్శకుడిగా భరణికి దక్షిణాధిన మంచి పేరుంది. ఇప్పుడు భరణి బాలీవుడ్ బాట పట్టనున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ జంట బిగ్ బీ అమితాబచ్చన్-రేఖను డైరెక్ట్ చేయబోతున్నారు. తెలుగులో వచ్చిన మిథునం సినిమాను ఆయన హిందీలో రీమేక్ చేయబోతున్నారు.
దీనిపై తాజాగా భరణి మాట్లాడుతూ… ఆరేళ్లుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలిపాడు. అయితే, భరణి ప్రస్తుతం వంద సినిమాల దర్శకుడు కె.రాఘవేంద్రరావును హీరోగా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక అమితాబ్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు.