వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కావడంతో ఇప్పుడు యువ దర్శకుడు బాబీ బిజీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకు ముందు కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న బాబీకి ఈ సినిమా మంచి ప్లస్ అయింది అనే చెప్పాలి. ఇప్పుడు స్టార్ హీరోతో ఒక సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నాడు. అందుకోసం ఒక కథ కూడా సిద్దం చేసుకుని రెడీ గా ఉన్నాడు.
అతను సినిమాల్లోకి రావడం వెనుక పెద్ద కథ ఉంది. ముందు రైటర్ గా పని చేసి ఆ తర్వాత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. ముందు శ్రీహరి హీరోగా వచ్చిన భద్రాద్రి సినిమా కోసం రైటర్ గా పని చేసాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల, కోన వెంకట్ దగ్గర పని చేసాడు. అలాగే మరికొందరు దర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా కూడా పని చేసిన బాబీ… రవితేజా సినిమాల కోసం ఎక్కువగా పని చేసాడు.
రవితేజాతోనే డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. పవర్ అనే సినిమాకు కథ రాసుకుని రవితేజా వద్దకు వెళ్ళగా అది రవితేజాకి బాగా నచ్చింది. వెంటనే ఓకే చేయడంతో సినిమా చేసాడు. అది సూపర్ హిట్ కావడంతో… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా చేసాడు. అది షాక్ ఇచ్చినా వెనక్కు తగ్గకుండా జై లవకుశ అనే సినిమా చేసాడు. ఆ తర్వాత మంచి అవకాశం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది.