b
దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో దర్శకుడు బాబీ ప్రమోషన్ పనిలో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఇటీవల ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో బాబీ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా పరాజయం చెందటం నా కెరీర్ ను దెబ్బతీసిందని చాలా మంది అంటుంటారు. కానీ ఆ సినిమా పరాజయం చెందినందుకు నేను ఏ రోజు కూడా బాధపడలేదు. పవన్ కళ్యాణ్ గారితో ఓ ఫోటో దిగితే చాలు అనుకున్నాను. అలాంటిది నేను సినిమా తీశాను. అది ఒక మంచి అనుభూతంటు పవన్ పై తనకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు దర్శకుడు బాబీ.