ఉప్పెన మూవీతో తొలి ప్రయత్నంలోనే అందరి నుండి ప్రశంసలు పొందిన దర్శకుడు బుచ్చిబాబు సానా. సినిమా భారీ విజయం సాధించటంతో… తర్వాత ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీని చేయాలని కథ రెడీ చేశాడు. ఆ కథ ఎన్టీఆర్ కు సరిపోతుందని నమ్మకంగా ఉన్నాడు. కానీ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్, త్రివిక్రమ్ తో మూవీ, కేజీఎఫ్ దర్శకుడితో మూవీలు పూర్తిచేస్తే కానీ ఖాళీ అయ్యేలా కనిపించటం లేదు. ఎంతకాదన్న కనీసం రెండు సంవత్సరాలు ఆగాలి.
దీంతో ఆ కథను ఎన్టీఆర్ కోసం అలాగే పక్కనపెట్టేసి… ఇప్పుడు మరో కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. నాగ్ చైతన్యకు సరిపోయేలా ఉన్న ఆ లవ్ ట్రాక్ కథను త్వరలోనే బుచ్చిబాబు చైతూకి చెప్పనున్నాడని ఫిలింనగర్ టాక్. ఈ సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే తెరకెక్కించాల్సి ఉంది. మరోవైపు చైతూ కూడా కొన్ని కమిట్మెంట్స్ తో ఉన్నాడు. దీంతో చైతూకు ఆ కథ విపరీతంగా నచ్చితే తప్పా ఇప్పటికిప్పుడు సినిమా పట్టాలెక్కేలా లేదు.