సినిమా టికెట్ బుకింగ్ పై ఏపీ ప్రభుత్వం ఓ పోర్టల్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై అక్కడినుంచి సినిమా టికెట్ బుక్ చేసుకోవాలని ఓ జీవో కూడా రిలీజ్ చేసింది. అయితే ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా దీనిపై డైరెక్టర్ దేవకట్ట స్పందించారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం రైల్వే టికెట్ ని ప్రభుత్వ ఖజానా కోసం అమ్ముతుంది. ఎందుకంటే ఆ రైల్వేస్ ని ప్రభుత్వం నడుపుతోంది కాబట్టి. అలాగే ఒక ప్రైవేట్ సంస్థ పెట్టిన పెట్టుబడులను ఏపీ ప్రభుత్వంకి నిధులను అనిపిస్తుందా… ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆన్ లైన్ టికెటింగ్ విధానం ఎలా ఉందంటే ఒక సినిమాని చేయడం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో ఇన్వెస్ట్ చేయడంలా ఉందని అన్నారు.
అంటే ఒక లైన్ లో నించుని అన్ని బిల్స్ క్లియర్ అయ్యే వరకు ఎదురు చూడాలా అని ప్రశ్నించారు. ఇలా అయితే టికెట్స్ అమ్ముడుపోయే వరకు ఒక నిర్మాత పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎదురు చూడాలి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే ఎవరైనా దయచేసి నన్ను సరి చెయ్యండి అంటూ ట్వీట్ చేశారు దేవకట్ట.
Govt sells railway tickets to credit into Govt A/Cs b’cause railways r run by Govt. Is d AP Govt going to fund all d movies to hav sch revenue routing control over a product that a private entity hav invested in? (1/2) #JustAsking
— #ThankYouCollector (@devakatta) September 8, 2021
Does d proposed AP Govt online ticketing setup means making a movie is like investing into a Govt contract, later waiting in line to get d bills cleared? Is this how d producer has to get his investment back from such ticket sales? Pls correct me if my perception is wrong🙏 (2/2)
— #ThankYouCollector (@devakatta) September 8, 2021
Advertisements