వైఎస్, చంద్రబాబు రాజకీయంగానే కాదు అంతకు ముందునుండి ఒకరికి ఒకరు తెలుసు. మంచి స్నేహితులు కూడా. కానీ రాజకీయం వేరు కదా… అంతకు ముందు మిత్రులే కావచ్చు కానీ పవర్ గేమ్ మాత్రం ఒక్కటే అంటూ వైఎస్, చంద్రబాబుల స్నేహం, రాజకీయ జీవితంపై దర్శకుడు దేవకట్ట సినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసేశాడు. ఇంద్రప్రస్థం అంటూ టైటిల్ ఫిక్స్ చేశాడు.
ప్రొడోస్ ప్రొడక్షన్స్ పతాకంపై తేజ వి, హర్ష విలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్న దర్శకుడు దేవకట్ట… ఈ సినిమా పూర్తైన తర్వాత ఇంద్రప్రస్థం సినిమాను తెరకెక్కించనున్నాడు.