అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం నల్లమల. మంచి హైప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ఏమున్నవే పిల్లా పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబదించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతుంది. టీజర్ ను సెప్టెంబర్ 30 వ తేదీన ఉదయం 11 గంటలకు రామానాయుడు స్టూడియో లో ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేయబోతున్నారు. ఇక నల్లమల చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రవి చరణ్ అందిస్తున్న సంగతి తెలిసిందే.