నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అందుకు సంబంధించి ఆ టైటిల్ ని నిర్మాణ సంస్థ కూడా రిజిస్టర్ చేసుకుందట.
కానీ దీనిపై గోపీచంద్ కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ… టైటిల్ విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని…సినిమా టైటిల్ విషయంలో రేకెత్తుతున్న ఈ ఆసక్తి, ఉత్సుకత ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. అలాగే సరైన సమయంలో ఈ కథకు తగిన పేరును, ఇతర వివరాలను తప్పకుండా తెలియచేస్తా అని అన్నారు గోపిచంద్.