ఈ సంక్రాంతికి బరిలో నిలిచిన భారీ సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి.. బాక్సాఫీసు వద్ద మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ హీరోయిన్ శ్రుతి హాసనే కావడంతో ఆమె ఈ విజయాలను ఎంజాయ్ చేస్తోంది.
అయితే కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. శ్రుతి హాసన్ కి ఐ లవ్ యూ అని చెప్పాడు.ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన హీరోయిన్ శృతి హాసన్.. లవ్ యూ చెప్పిన గోపిచందన్ ని అన్నయ్య అని పిలిచింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోలర్స్ ఊరుకోలేదు. తెగ ఆడేసుకున్నారు. తాజాగా ఈ వార్తల పై గోపిచంద్ స్పందించారు. శ్రుతి తో నేను మూడు సినిమాలు చేశాను. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి. ఆమెతో నాకు బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ ఉంది. అదే లవ్ ని నేను స్టేజ్ పై చెప్పాను.
కానీ సోషల్ మీడియాలో వాటిని వేరేలా ప్రొజెక్ట్ చేశారు.. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను. శ్రుతితో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది అంటూ చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఈ ట్రోలింగ్ కి అడ్డుకట్టే వేసే ప్రయత్నాన్ని అయితే గోపిచంద్ చేశారు మరి. ఇప్పటికైనా సోషల్ మీడియా ట్రోలర్స్ ఆగుతారో లేదో చూడాలి.