సినిమాల్లో ప్రయోగాల ప్రేమికుడు కమల్ హాసన్.‘విక్రమ్’ సినిమాతో చాలా రోజుల తర్వాత మాస్ కమర్షియల్ హిట్ అందుకున్నారు. అయితే కమల్ నెక్ట్స్ మూవీ ఎవరి దర్శకత్వంలో ఉండబోతుందనేది అభిమానుల్లో చర్చకొచ్చే ప్రశ్న. తమిళనాట యాక్షన్ మూవీస్ అనగానే హీరోలకు గుర్తొచ్చే కమర్షియల్ దర్శకుల పేర్లలో హెచ్ వినోద్ ఒకరు. సతురంగ వెట్టై, థీరన్ అధిగరమ్ ఒండ్రు వంటి హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
రీసెంట్గా హీరో అజిత్తో ‘తునివు’ సినిమా చేసి తమిళనాట బిగ్ సక్సెస్ను అందుకున్నారు. అంతకుముందు కూడా అజిత్తోనే ఆయన వరుసగా నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలను చేసి ఆకట్టుకున్నారు.
ఈ క్రమంలోనే హెచ్ వినోద్ తదుపరి దర్శకత్వం వహించబోయే హీరోల్లో ధనుశ్, కమల్హాసన్, విజయ్ సేతుపతి పేర్లు వినిపించాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కమల్హాసన్తో ఆయన సినిమా ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది.
KH233 వర్కింట్ టైటిల్తో త్వరలోనే ఈ మూవీ గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కమల్ హాసన్.. శంకర్ డైరెక్షన్లో ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం పూర్తయ్యాకే KH233 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు.
దర్శకుడు హెచ్ వినోద్.. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్కు సంబంధించిన పనులు చూసుకుంటారని తెలిసింది. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారట. అలానే సినిమాను అధికారికంగా ప్రకటించే ముందు ఆయన కమల్తో మరోసారి పూర్తి స్థాయి చర్చలు జరుపుతారట. అప్పుడు అన్నీ ఓకే అనుకుంటే సినిమాను అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో కాకుండా మీడియం బడ్జెట్లోనే రూపొందిస్తారని సమాచారం. త్వరలోనే నటీనటులు వివరాలు కూడా ప్రకటిస్తారట. అయితే వినోద్-కమల్ కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉంటుందో అని సినీ ఆడియెన్స్లో భారీ ఆసక్తి నెలకొంది.