హరీష్ శంకర్… టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకుని వరుణ్ తేజ్ లాంటి క్లాస్ హీరోని సైతం గడ్డలకొండ గణేష్ గా చూపించి మెప్పించిన స్టార్ డైరెక్టర్. ఎప్పుడూ సోషల్ మీడియా తో యాక్టీవ్ గా ఉండే హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యుల పై దాడి జరిగిన ఘటనపై స్పందించిన ఆయన డాక్టర్లు, నర్సులు మనుషులు కదా… వాళ్ళు పౌరులు కదా… పౌర హక్కుల సంఘాలవారు, మానవహక్కుల సంఘాలవారు ఎక్కడ ఉన్నారు..! ఒక్కరు కూడా పత్తాలేరు. సజ్జనార్ సర్ ను కడిగేయటానికి తోసుకుంటూ మాత్రం ముందుకు వస్తారంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.
ఓ వైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇలాంటి సమయంలో కూడా డాక్టర్ ప్రాణాలను తెగించి వైద్యం చేస్తుంటే వారి దాడి చేస్తారా అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు స్పందించి డాక్టర్ లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.