పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రానే వచ్చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమా వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు. కాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి థమన్ బుధవారం ఉదయం 9 గంటలకు రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు. దీనితో అభిమానులలో మరింత ఆత్రుత పెరిగింది. అయితే థమన్ చేసిన ట్వీట్ కు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా స్పందించారు. బావా కుమ్మేసావని న్యూస్ వచ్చింది…నా వల్ల కాదు ఆగలేక పోతున్న అని ట్వీట్ చేశాడు హరీష్. హరీష్ చేసిన ట్వీట్ ను చూసిన పవన్ అభిమానులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఆసక్తితో బుధవారం ఉదయం 9 గంటల కోసం ఎదురు చూస్తున్నారు.
Kummesaaavani news ochindi Bawa … even i cant wait 🤗🤗 https://t.co/folXXuqn0g
— Harish Shankar .S (@harish2you) August 31, 2020