టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కళాతపస్వి కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.
జయలక్ష్మి మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే కే విశ్వనాథ్ కన్నుమూసి కనీసం నెల రోజులైనా గడవకముందే ఆయన సతీమణి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూసినట్లు సమాచారం.