ఇటీవల విడుదలైన ఆచార్య టీజర్ తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా నటిస్తుండటం, పైగా కొరటాల శివ దర్శకత్వంలో కావటంతో సినిమాకు భారీ బిజినెస్ రానుంది. ఈ సినిమాను మెగాస్టార్ హోం బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే, సడన్ గా నిర్మాణ బాధ్యతల నుండి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తప్పుకోగా, మొత్తం మ్యాట్నీ మూవీ మేకర్స్ సంస్థే చూసుకుంటుంది.
ఇటు చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ కూడా రెమ్యూనరేషన్ తో పాటు సినిమా బిజినెస్ లో వాటా తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతుంది. దీంతో భారత్ అనే నేను సినిమాకు లాగే ఆచార్య మూవీ బిజినెస్ కూడా తనే స్వయంగా చూస్తున్నారు.
నైజాం మినహా అన్ని ఏరియాల్లో ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ పూర్తైనట్లు ప్రచారం సాగుతంది. నైజాంకు దిల్ రాజుతో పాటు వరంగల్ శ్రీను పోటీపడుతున్నారని… త్వరలో ఫైనల్ అవుతుందని సమాచారం. మే 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా, త్వరలోనే డిజిటల్ రిలీజ్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా క్లోజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.