టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉంది. వకీల్ సాబ్ షూట్ పూర్తి చేసుకున్న పవన్… జనవరి 4 నుండి క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూట్ కు హజరవ్వాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సినిమా షూట్ నిలిచిపోయింది.
జనవరి 4 నుండి షూటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా కరోనా టెస్ట్ చేయించుకోగా… డైరెక్టర్ క్రిష్ కు పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం క్వారెంటైన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే సినీ ఇండస్ట్రీలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కరోనా బారిన పడ్డారు.