వేదం సినిమాలోని కర్పూరం క్యారెక్టర్ బాగా క్లిక్ అయ్యింది. ఇప్పటికీ కర్పూరం పాత్రకి సంబంధించి డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వేదం మూవీ లోని కర్పూరం పాత్రకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే కర్పూరం పాత్ర మొదట చేయాల్సింది ఓ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అట.
వేదం సినిమాలో అల్లు అర్జున్ కేబుల్ రాజుగా పాత్రలో అద్భుతంగా నటించారు. అదేవిధంగా అనుష్క నటించిన సరోజ పాత్ర కూడా మంచి పేరు వచ్చింది. ఇక మరో హీరో మంచు మనోజ్ కూడా నటించారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఇందులో నటించిన వారి నటనని, ఇలాంటి కథను ఎంచుకున్న దర్శకుడు క్రిష్‌ని ప్రశంసించారు.
ఈ సినిమాలో అనుష్క పక్కన మరో వ్యక్తి కూడా ఉంటాడు. తనే కర్పూరం. సరోజ వేరే ఊరికి వెళ్లి ఇవన్నీ వదిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణయించుకున్నప్పుడు కర్పూరం సరోజకు మద్దతు ఇస్తుంది. అయితే ఈ చిత్రంలో కర్పూరం పాత్ర పోషించిన వ్యక్తి పేరు నిక్కి.. ఇతను హీరోయిన్ అనుష్క పర్సనల్ మేకప్ స్టాఫ్.
అయితే వాస్తవానికి ఈ పాత్రను డైరెక్టర్ క్రిష్ చేయాలట. కానీ క్రిష్ వాళ్ల తల్లి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. ఆ పాత్ర చేస్తే పెళ్లి కాదని చెప్పారట. దీంతో ఆ సమయంలో అనుష్క నిక్కి పేరు సజెస్ట్ చేసిందట. అదేవిధంగా నిక్కి చేసిన ఒక డ్యాన్స్ వీడియో కూడా క్రిష్‌కి చూపించారు. ఆ వీడియో చూసి ఈ పాత్రకి నిక్కిని ఎంపిక చేశారు. ఈ క్యారెక్టర్ క్రిష్ చేస్తే ఎలా ఉండేదో మరి.