ప్రతిరోజు పండగే తర్వాత మరో సినిమా మొదలుపెట్టని డైరెక్టర్ మారుతీ… ఎవరితో సినిమా చేస్తారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. హీరో రామ్ తో సినిమా ఉంటుందని, రవితేజతో మూవీ లాక్ అయ్యిందని, రవితేజ డ్రాప్ కావటంతో గోపిచంద్ తో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారానికి మారుతి సంక్రాంతి రోజున పుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా మారుతి వాయిస్ తో ఓ వీడియో విడుదల చేయనున్నారని, అందులో తన నెక్ట్స్ మూవీ టైటిల్ తో పాటు హీరో ఎవరు అనే విషయాలను ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తుంది.
దీంతో కొత్త హీరో ఎవరైనా తెరపైకి వస్తారా… లేక గోపిచంద్ ఫైనల్ అవుతారో చూడాలి.