టాలెంటెడ్ కథా రచయిత, డైరెక్టర్ మారుతీ అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తిచేస్తారన్న పేరుంది. ప్రతిరోజు పండగే తో హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్, ఓ కథతో మాస్ మహారాజ్ రవితేజను కలిశారు. కథ ఒకే అయినప్పటికీ రెమ్యూనరేషన్ ప్రాబ్లంతో ప్రాజెక్ట్ నుండి రవితేజ్ తప్పుకున్నారు.
అదే కథతో మారుతీ గోపిచంద్ తో సినిమా తీయనున్నారు. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను తెరకెక్కించున్నాయి. ఈ మూవీలో గోపిచంద్ లాయర్ పాత్రలో కనిపించనుండగా, పక్కా కమర్షియల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ విశేషాలను అధికారికంగా ప్రకటించనుండగా… ప్రస్తుతం సిటీమార్ మూవీలో ఉన్న గోపిచంద్ త్వరలో షూట్ పూర్తి చేసుకొని, పక్కా కమర్షియల్ టీంతో జతకట్టనున్నారు.