హీరోకి ఏంటో ప్రోబ్లమ్! - Tolivelugu

హీరోకి ఏంటో ప్రోబ్లమ్!

ఒక్కొక్క డైరెక్టరుకీ ఒక్కో సెంటిమెంట్ వుంటుంది. ఒక డైరెక్టర్ మూడక్షరాల టైటిల్ దగ్గర ఫిక్స్ అవుతాడు. మరో డైరెక్టర్ స అనే అక్షరం టైటిల్లో ముందుండేలా చూసుకుంటాడు. మరో డైరెక్టర్ తన సినిమాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లూ, అక్కని ప్రేమించి చెల్లిని పెళ్లాడే హీరో దాదాపు ప్రతి సినిమాలో వుండేలా చూసుకుంటాడు. ఆ విషయం అమాయకులైన ప్రేక్షకులకు తెలియదనుకుంటాడు, అది వేరే మేటర్. విషయానికి వస్తే డైరెక్టర్ మారుతికి కూడా ఒక సెంటిమెంట్ వుంది. అదేంటంటే..

దర్శకుడు మారుతి ఏ మూవీ తీసినా అందులో హీరోకి ఏదో ఒక డిసీజ్. గతంలో భలే భలే మగాడివోయ్‌లో హీరో నానికి మతిమరుపు వ్యాధి ఉంది. దాంతో ప్రేక్షకుల్ని నవ్వించాడు.

మహానుభావుడులోనూ ఒక వీక్ పాయింట్. అది అతి పరిశుభ్రత. ఈ రెండు మూవీలోనూ హీరోల వీక్ పాయింట్‌ను బేస్ చేసుకుని హాస్యంతో పాటు ఎమోషన్స్ పండించారు మారుతి.

ఇప్పుడు తాజాగా సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ‘ప్రతి రోజు పండగే’లో రోజూ సెలబ్రేట్ చేసుకునే వీక్ పాయింట్ హీరోకి ఉందా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకూ హీరో ప్రతిరోజూ పండుగ చేసుకునే వీక్ పాయింట్ తోనే కథ నడిచిందా? లేదా? అనేది నెటిజన్ల టాక్ !

Share on facebook
Share on twitter
Share on whatsapp