దాదాపు సంవత్సరం తర్వాత తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు డైరెక్టర్ మారుతి. పక్కా కమర్షియల్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. గోపిచంద్ హీరోగా మార్చి మొదటి వారం నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి ఈ సినిమాలో రవితేజ నటించాల్సి ఉండగా, రెమ్యూనరేషన్స్ లో మనస్పర్ధల కారణంగా పక్కకు తప్పుకున్నాడు.
షూటింగ్ మొదలవ్వక ముందే అక్టోబర్ 1న సినిమా విడుదల చేస్తామంటూ కర్చీఫ్ వేసిన మారుతీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశికన్నాను అనుకున్నారు. కానీ గోపిచంద్ నో చెప్పారు. దీంతో మళ్లీ వెతుకులాట ప్రారంభించి చివరకు సాయి పల్లవి వైపు మొగ్గుచూపారు. కానీ తనకు డేట్స్ అడ్జెస్ట్ కావటం లేదని నో చెప్పేసింది. ఇతర హీరోయిన్లంతా దాదాపు బిజీగా ఉన్నారు. దీంతో హీరోయిన్ కోసం మారుతీ వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుంది.