ప్రతిరోజు పండగే సినిమాతో ఇటీవల మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు మారుతి. మొదటి సినిమా నుంచి హీరోలను కొత్తగా చూపిస్తూ హిట్స్ కొడుతున్న మారుతి ప్రతిరోజు పండగే సినిమా తరువాత నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చెయ్యలేదు. అయితే ఓ కథ సిద్ధం చేసుకుని చాలా మంది హీరోలకు వినిపించినప్పటికీ ఎవ్వరూ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వలేదట. దీనితో దానినిపక్కన పెట్టి తనకు మంచి హిట్ ఇచ్చిన హీరో నానినే పట్టుకున్నాడట. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మారుతి ఇప్పటికే నానికి కథ చెప్పినట్లు.. నానికి కూడా కథ నచ్చడంతో మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచినట్లు సమాచారం. అయితే ఇంతకముందు వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండనుంది అని తెలుస్తుంది.