ఇటీవల బాలీవుడ్ నటి అనుష్క శర్మ విరాట్ కోహ్లీలు తాము ముగ్గురం కాబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ మహిళా జర్నలిస్టు ఆసక్తికర కామెంట్ చేసింది. అంతగా మిడిసిపడకు. అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ కు మహారాణిని ఏమీ చేయలేదు అంటూ కామెంట్ చేసింది.
ఈ కామెంట్ ను దర్శకుడు మారుతి తీవ్రంగా ఖండించారు. విచారకరమైన స్పందన. అది కూడా ఓ మహిళా జర్నలిస్ట్ నుంచి… ఓ మహిళ ఇంగ్లండ్ మహారాణి కావడం కన్నా, బిడ్డకు తల్లి కావడమే సంతోషకరం. అనుష్క సెలబ్రిటీ కావడానికన్నా ముందే ఓ యువతి. తల్లి కాబోతున్న క్షణాలను ప్రతి క్షణం ఆహ్వానించే హక్కు ఆమెకు ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.
Disgraceful comments
That too frm a lady journalist 🙁Motherhood is bigger joy than being queen of England
Yes every woman is a queen & every happy home is a kingdomShe's a normal human being too before being a celebrity & she has full right to be happy & flaunt her baby bump https://t.co/QnwX8Uzfy5
— Director Maruthi (@DirectorMaruthi) September 14, 2020